Saturday, May 4, 2024

జింక‌ల్లో మూడు ర‌కాల కొవిడ్ వేరియంట్స్ – ఎక్క‌డంటే

మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కి కూడా క‌రోనా వ్యాపిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా జంతువుల్లో కూడా వేగంగా వ్యాపిస్తోంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్ల తోక జింక‌ల్లో మూడు ర‌కాల కొవిడ్ 19వేరియంట్స్ ను యూఎస్ శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు .. జనవరి , మార్చి 2021 మధ్య కాలంలో.. ఈశాన్య ఒహియో ప్రదేశాలలో దాదాపు 9 ప్రాంతాల్లో 360 తెల్ల తోక గల జింకల నాసల్​ స్వాబ్స్​ సేకరించారు. వీటిని, పిసిఆర్ టెస్టింగ్​ ద్వారా ప‌రీక్షించ‌గా.. అందులో 129 (35.8 శాతం) జింకలలో మూడు రకాల SARS-CoV-2 (B.1.2, B.1.582 మరియు B.1.596) వేరియంట్లను గుర్తించారు.

ఈ అధ్యయ‌నా ఫ‌లితాల‌ను నేచర్​ జర్నల్​లో ప్రచురితమైంది. అడవి జింకలు సార్స్​ కోవ్​-2 వైరస్​కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వాటిలో వైరస్​ దీర్ఘకాలం కొనసాగితే.. మనుషులకు సార్స్​ కోవ్​-2 వైరస్​ సంక్రమించే కొత్త మూలాన్ని కలిగి ఉన్నట్లే. మనుషుల్లో మాదిరిగానే.. జింకల్లోనూ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు. కాగా మ‌నుషుల ద్వారానే జింక‌ల‌కు వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. మ‌నుషుల కంటే స్పీడ్ గా జంతువుల‌లో వ్యాపిస్తుంద‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement