Thursday, May 2, 2024

Gossips: నాకు పొగరు అనే ప్రచారంలో నిజం లేదు.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న నిత్యా!

సౌతిండియాన్ స్టార్​​ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. అందాల ప్రదర్శన కంటే అభినయానికే ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తూ తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటించే చాన్సెస్​ అందుకుంది. నిత్యా తాజాగా ఓ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బాగా పొగరు అని ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించింది.

ఇండస్ట్రీలో తనకు చాలామంది శత్రువులున్నారని వెల్లడించింది. వారే తనను కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొంది. వారికి లోబడి తాను నడుచుకోకపోవడంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని మండిపడింది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించానని, ఏ ఒక్కరూ నిత్యాతో పనిచేయడం కష్టమని అనలేదని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement