Sunday, April 28, 2024

మ‌గువ తెగువ‌.. మూడు సింహాల వెనుక న‌డిచిన మ‌హిళ‌.. ఈ వీడియోకి 60ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్

ఒక సింహాన్ని చూస్తే ఎవ‌రికైనా గుండె జారిపోతుంది. అటువంటింది ఏకంగా మూడు సింహాలు ఎదురుప‌డితే అమ్మో ఇంకేమైనా ఉందా. అయితే ఇక్క‌డ ఓ మ‌హిళ ఏకంగా మూడు సింహాల వెంట న‌డిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ వీడియోను డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్ జెన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.ఆమె ఇన్‌స్టాగ్రాం ఫీడ్ ప‌లు సింహాల వీడియోల‌తో నిండిఉంది. జంతువుల‌తో క‌లిసి జెన్ న‌డిచివ‌స్తున్న వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 60 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ల‌భించాయి. మూడు సింహాలు త‌మ‌తో ఆమెను న‌డిచేందుకు అనుమ‌తిస్తున్నాయంటే వాటికి ఆ మ‌హిళ ఓ ప్ర‌త్యేక వ్య‌క్తి అని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు. ఈ సింహాలు ఎంత సౌమ్యంగా ఉన్నా ఏ క్ష‌ణం ఏం జరుగుతుందో చెప్ప‌లేమ‌ని, ఆ మ‌హిళ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ల‌య‌న్స్‌తో గేమ్స్ ప్ర‌మాద‌మ‌ని మ‌రో నెటిజ‌న్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement