Tuesday, March 26, 2024

హిట్​‌-3లో మెయిన్ రోల్ చేయ‌బోతున్న నాని.. హిట్ 2లోనే ఇంట్ర‌డ‌క్ష‌న్

నేచురల్ స్టార్ నాని హిట్ 2 సిినిమా క్లైమాక్స్‌లో అర్జున్ సకార్‌గా అతిథి పాత్రలో న‌టించి ఆశ్చర్యపరిచాడు. రూల్స్ ని పట్టించుకోని క్రూరమైన పోలీసు ఆఫీస‌ర్ (అర్జున్ సర్కార్) క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అభిమానులను థ్రిల్ చేసింది. మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన హింట్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హిట్-3 మెయిన్ రోల్‌లో కొన‌సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

హిట్-2 మూవీ రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్‌ని దాటడంతో, సినమాలో అతిధి పాత్రలో కనిపించిన నాని తన అర్జున్ సర్కార్ లుక్‌ని సోషల్ మీడియాలో రివీల్ చేశాడు. HIT 2ని సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ అర్జున్ సర్కార్ లుక్‌తో ఉన్న పిక్‌ని పోస్ట్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం మూడో భాగాన్ని శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేయనున్నారు.

- Advertisement -

ఇక‌.. నానికి చెందిన ‘‘వాల్‌పోస్టర్ సినిమా’’ ఈ మూవీని నిర్మిస్తోంది. నాని తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీని షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. నాని ప్రస్తుతం దసరా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. అది ఈ ఏండాకాలంలో అంటే 2023లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. కాగా, నాని హాలిడే ట్రిప్​ కోసం యూరప్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తిరిగి వచ్చిన తర్వాత దసరా పెండింగ్ షూట్‌ను పూర్తి చేస్తారని టాలివుడ్​ వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement