Monday, April 29, 2024

స‌ర్క‌స్ బోను నుండి బ‌య‌టికి వ‌చ్చిన సింహాలు.. త‌ప్పిన ప్ర‌మాదం

ఓ స‌ర్క‌స్ లో అనుకోని సంఘ‌ట‌న జ‌రిగింది. బోను లోప‌ల సింహాల‌తో విన్యాసాలు చేయించేందుకు నిర్వాహ‌కులు త‌మ వంతు ప్ర‌య‌త్నిస్తున్నారు.అక్కడున్న రెండు సింహాలు నిర్వాహకుల మాట వినేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. స్టిక్ పట్టుకుని వాటిని అదిలిస్తూ, ఐరన్ రింగ్ నుంచి దూకాలంటూ ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ ఆ సింహాలు బోను లోపల అటూ, ఇటూ పరుగెత్తుతున్నాయే కానీ, చెప్పినట్టు చేయడం లేదు. చివరికి అవి బోను గేట్ ను బలవంతంగా తెరిచేసుకుని బయటకు వచ్చేశాయి. వాటిని చూసి జనాలు పరుగుపెట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట కూడా జరిగింది. చుట్టూ జనాలు ఉండడంతో సింహాలకు సైతం ఎటు పోవాలో పాలు పోలేదు. దాంతో అవి అక్కడే ఉండిపోయాయి. చివరికి అవి ఎవరినీ ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.చైనా హెనాన్ ప్రావిన్స్ లోని లూయాంగ్ లో సర్కస్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement