Saturday, May 21, 2022

ది కాశ్మీరీ ఫైల్స్ -ఓటీటీ రిలీజ్ కి రెడీ

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కాశ్మీరీ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిని షేక్ చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందేే.పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కాశ్మీరి ఫైల్స్ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మే 13న జీ5లో ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement