Friday, April 26, 2024

అడవిలో వయోలిన్ వాయించిన అమ్మాయి.. మైమరచి పోయిన జింకలు

ఒకామో వయోలిన్ వాయిస్తుండగా అటుగా వెళ్తున్న రెండు జింక‌లు మైమ‌రిచిపోయి ఆస‌క్తిగా వింటున్నాయి. స్పెయిన్‌కి చెందిన ఈమె పేరు డ‌యానా. అడ‌వి మ‌ధ్య‌లో కుర్చీలో కూర్చొని జ‌ర్మ‌నీకి చెందిన సంగీత‌కారుడు జొహ‌న్ సెబాస్టియ‌న్ బాచ్ సంగీతాన్ని వ‌యోలిన్ మీద‌ ప‌లికించింది. ఆమె ల‌య‌బ‌ద్ధంగా వ‌యోలిన్ వాయిస్తుంటే, రెండు జింక‌లు ఆస‌క్తిగా విన‌డ‌మే కాకుండా నెమ్మ‌దిగా ఆమెకు ద‌గ్గ‌రగా వ‌చ్చాయి. డ‌యానా వాటిని చూసి బెద‌ర‌కుండా అలానే కూర్చొని వ‌యోలిన్ వాయించింది. అడ‌విలో వ‌యోలిన్ వాయిస్తున్న ఫొటోలు, వీడియోను డ‌యానా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘వ‌యోలిన్ ప‌ట్టుకొని అడ‌వికి వెళ్లి, అక్క‌డ జొహ‌న్ సెబాస్టియ‌న్ సంగీతాన్ని ప‌లికిస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి’ అనే క్యాప్ష‌న్ పెట్టింది. ఈ వీడియోను డార్థ్ అర్రెంకే అనే రెడ్డిట్ యూజ‌ర్ ఈమ‌ధ్యే సోష‌ల్‌మీడియాలో పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో 96 వేల మందికి పైగా చూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement