Monday, April 29, 2024

దుబాయ్ లో ‘ది ఘోస్ట్’ – యాక్ష‌న్, రొమాంటిక్ సీన్స్ షూట్

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ది ఘోస్ట్ సినిమాలో న‌టిస్తున్నారు హీరో నాగార్జున‌. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో జ‌రుగుతోంది. దుబాయ్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను .. కొన్ని రొమాంటిక్ సీన్స్ ను .. ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. మరి కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగును జరపనున్నార‌ట‌. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ముందుగా కాజల్ ను అనుకుంటే వ్యక్తిగత కారణాల వలన ఆమె చేయలేకపోయింది. దాంతో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఇంతవరకూ బాలకృష్ణ సరసన కథానాయికగా ఎక్కువ సినిమాలు చేసిన సోనాల్, నాగ్ తో చేయడం మాత్రం ఇదే మొదటిసారి. నారాయణ దాస్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement