Wednesday, May 15, 2024

ఆట ఇంకా అయిపోలే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్లా గెలుస్తరో చూస్తం: మమతా బెనర్జీ

ఈ మధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ బీజేపీ మిడిసిపాటు తగతదని పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అన్నారు. “ఆట ఇంకా ముగియలేదు” రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి అంత ఈజీ కాదని బుధవారం చెప్పారు. ఉత్తర ప్రదేశ్​లో గతం కంటే ఆ పార్టీకి సీట్లు చాలా తక్కువ వచ్చాయని, సమాజ్ వాదీ వంటి పార్టీలు బలంగా ఉన్నందున వారు పెద్దగా మాట్లాడకూడదని దుయ్యబట్టారు.  ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కాదు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో సగం కూడా వారికి లేరు. ప్రతిపక్ష పార్టీలకు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు.. అని ఆమె అసెంబ్లీలో ఇవ్వాల అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ సిస్టమ్​ ద్వారా నిర్వహిస్తారు. రాష్ట్ర శాసనసభల నుండి ప్రతి ఓటరు ఓట్ల సంఖ్య, విలువ 1971లో రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకునే ఫార్ములా ద్వారా రూపొందించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ శిబిరాన్ని గద్దె దింపాలని..  బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను కట్టాలని ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ, కేంద్రంలోని అధికార పార్టీతో పోరాడటానికి దేశం సిద్ధమవుతోందని అన్నారు. కాగా, ఈ తృణమూల్ బాస్ హిల్స్ అండ్ హోమ్ అఫైర్స్ బడ్జెట్ చర్చలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నందుకు రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు. ఇటీవల కాంగ్రెస్, తృణమూల్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల హత్యలను ఖండిస్తూ ఈ విషయాలను పోలీసులు విచారిస్తున్నారని, నిందితుల రాజకీయ సంబంధాలను పరిగణనలోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement