Tuesday, May 7, 2024

Breaking: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరొకరి పరిస్థితి విషమం

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వేగంగా వెళ్తూ ఓ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో ఇవ్వాల (శుక్రవారం) జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల‌ప్ర‌కారం.. ముందు వెళ్తున్న వెహిక‌ల్‌ని ఓవర్ టేక్ చేయబోయిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ప్రణయ్ (10)అనే అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement