Wednesday, May 8, 2024

పోలీసుల అదుపులో తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నిందితులు.. ఏపీలో అరెస్ట్!

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నాయకుడు, టేకులపల్లి సొసైటీ డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. వీరిని ఆంధ్ర ప్రదేశ్ లో అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితులను పట్టుకోవడం కోసం ఖమ్మం అడిషనల్ డీసీపీ శభరీష్ సారధ్యంలో ఒక టీం ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లింది. మూడు రోజుల నుంచి పలుపాంత్రాల్లో ఉండి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబందించి నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతున్న‌ట్టు స‌మాచారం. ఇవ్వాల (గురువారం) తెల్లవారు జామున నిందితులను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను ఖమ్మంకు తీసుకు వచ్చి ఇంటరాగేషన్ చేయనున్నారు.

మ‌ర్డ‌ర్ ఎట్లా జ‌రిగిందంటే..

ఆగస్టు 15న తెల్దార్ పల్లి వైపు తమ్మినేని కృష్ణయ్య బైక్ పై వెళ్తుండగా మద్దులపల్లి సమీపంలో సీసీఎం కు చెందిన వారు దారుణంగా పొడిచి చంపారు. గ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకు ఏడుగురు వ్యక్తులు ఈహత్యలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు ఎనిమిది మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341,132, 302, 149 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసు అధికారులు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. కాగా A1 గాఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని ఖమ్మం తీసుకొచ్చినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement