Saturday, June 22, 2024

సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ నివాసం వ‌ద్ద ఉగ్ర‌వాది రెక్కీ-విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు

కోల్ క‌త్తాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇంటి గురించి స‌మాచారం తెలుసుకోవ‌డానికి ఓ ఉగ్ర‌వాది రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా అనే ఉగ్రవాది భద్రతా ఏర్పాట్లను దాటి ముఖ్యమంత్రి నివాసంలోకి ఇనుపరాడ్ తో ప్రవేశించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారని చెప్పారు.

మొల్లాను విచారించిన సమయంలో పలు విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. మొల్లా 11 సిమ్ కార్డులను ఉపయోగించాడని… బంగ్లాదేశ్, బీహార్, ఝార్ఖండ్ లకు ఫోన్లు చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అతనికున్న కార్యకలాపాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని ఈ నెల 18 వరకు కోర్టు పొడిగించింది. సీఎం నివాసం వద్ద ఉగ్రవాది రెక్కీ నేపథ్యంలో… సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ ను పదవి నుంచి తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement