Tuesday, April 30, 2024

రాత్రి 7గంట‌ల‌కు ఎన్డీటీవీని చూడండి – ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

నేటి రాత్రి 7గంట‌ల‌కు ఎన్డీటీవీనీ చూడాల‌ని తెలిపారు మంత్రి కేటీఆర్.. భార‌త‌దేశంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన స్టార్ట‌ప్ రాష్ట్రంగా తెలంగాణ‌ను నేను ఎందుకు పిలుస్తాను? అనే విష‌యం తెలుసుకోవాలంటే.. త‌ప్ప‌కుండా గురువారం రాత్రి 7 గంట‌ల‌కు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడాల‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్డీటీవీలో ప్ర‌సారం కాబోయే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను కేటీఆర్ త‌న ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. తెలంగాణ ఆ ఫినిక్స్ రైజెస్ పేరుతో ఈ ప్రోగ్రాం ప్ర‌సారం కానుంది. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్యేక రాష్ట్రం సాధ్యం కాద‌న్నారు. అస‌లు ఇది మ‌న జీవిత‌కాలంలో కాదు అన్నారు. యుద్ధంలో గెల‌వ‌లేం అన్నారు. కానీ కేసీఆర్ మాత్ర‌మే న‌మ్మి, ఎలా సాధ్యం చేశారు అనే విష‌యాన్ని ఈ ప్రోగ్రాంలో రూపొందించారు. ఈ ప్రోగ్రాం గురువారం రాత్రి 7 గంట‌ల‌కు, శ‌నివారం రాత్రి 7:30 గంట‌ల‌కు, ఆదివారం రాత్రి 10 గంట‌ల‌కు ఎన్డీటీవీలో ప్ర‌సారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement