Sunday, May 19, 2024

తెలంగాణ ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల – షెడ్యూల్ రిలీజ్

జేఈఈ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ని తెలంగాణ ఇంట‌ర్ బోర్డు మార్చిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ నేప‌థ్యంలో
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇంటర్ బోర్డ్. కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల్లోమార్పు చేసి.. ఏప్రిల్‌ నుంచి మే 4 వ తేదీ నుంచి నిర్వహించనుండటంతో.. ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి మొదలు కావాల్సిన ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసింది తెలంగాణ విద్యాశాఖ. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మే 6 వ తేదీ నుంచి మే 23 వరకు జరుగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement