Sunday, April 28, 2024

ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ని వేగ‌వంతం చేయండి .. హైకోర్టు ..

ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ని వేగ‌వంతం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హై కోర్టు సూచించింది. ధాన్యం కొనుగోళ్ళు లేనందున రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని కొనుగోళ్లు చేప‌ట్టేలా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని లా స్టూడెంట్ కోర్టులో ప్ర‌యో ప్ర‌యోజిత వ్యాజ్యంని దాఖ‌లు చేశారు. కాగా ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ధ‌ర కంటే చాలా త‌క్కువ ధ‌ర‌కే ద‌ళారీల‌కు ధాన్యం అమ్ముకుంటున్నార‌ని ఆ పిటిష‌న్‌లో తెలిపారు. దీని వ‌ల్ల దళారీలు ల‌బ్ది పొందుతున్నార‌ని, కానీ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్నారు. రైతుల‌ను ర‌క్షించాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాము చ‌ట్టాల ప్ర‌కార‌మే న‌డుచుకోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపింది. చట్టాలు రూపొందించాల్సింది తాము కాదంది.

మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో ఎలాంటి చ‌ట్టం లేద‌ని చెప్పింది. అయితే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ‌డ్ల కొనుగోలుకు అవ‌స‌ర‌మైన దారులు వెత‌కాల‌ని, వేగంగా రైతుల నుంచి ధాన్యం సేక‌రించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. తెలంగాణ రైతాంగం నుంచి ఇప్ప‌టికే 27.07 ల‌క్ష‌ల ట‌న్నుల వ‌రి ధాన్యం కొనుగోలు చేశామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుఫున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ హైకోర్టుకు తెలిపారు. వానాకాలంలో పండిన పంట మొత్తం కొంటామ‌ని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రూ.2,800 కోట్లు ఇప్ప‌టికే రైతుల‌కు చెల్లించామ‌ని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 6439 కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు.. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వ‌చ్చే నెల 22వ తేదీ వ‌ర‌కు వ‌రి ధాన్యం సేక‌రిస్తామ‌ని ..రైతులెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement