Friday, April 26, 2024

సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర

గత ఏడాది లాక్‏డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తున్న సోనూసూద్‏ను దేవుడిగా కోలుస్తున్నారు చాలా మంది. ఎంతో మంది కరోనా బాధితులకు సాయం చేస్తూ… ప్రాణదాతగా నిలిచాడు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే చేసి చేతులు దూలుపుకోకుండా.. ఆసుపత్రి చికిత్స, మందులు, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇలా ఏ చిన్న సాయం కోరినా చేస్తూ తన సేవగుణాన్ని చాటుకుంటున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా సోనూసూద్‏ను ఆరాధించేవారు, అభిమానులు అధికంగా ఉన్నారు. తాజాగా సోనూసూద్ వీరాభిమానిగా మారిన తెలంగాణకు చెందిన యువకుడు వెంకటేశ్..ఎవరు చేయని సాహసం చేశాడు.

రియల్ హీరోను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర చేపట్టాడు. పది రోజుల్లో దాదాపు 700 కి.మీ. నడిచి ఎట్టకేలకు అభిమాన నటుడిని కలుసుకున్నాడు. తన కోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయాడు. అతడిని తన ఇంటికి పిలిచి.. కాసేపు అతడితో ముచ్చటించాడు. వెంకటేష్ తనకు ఎంతో స్పూర్థిదాయకంగా నిలిచాడని తెలిపాడు సోనూసూద్. కానీ దయచేసి ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement