Wednesday, May 8, 2024

టీమిండియా క్రికెట‌ర్ ‘అక్ష‌ర్ ప‌టేల్’ ఎంగేజ్ మెంట్

గాళ్ ఫ్రెండ్ తో టీమిండియా క్రికెట‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఎంగేజ్ మెంట్ ఘ‌నంగా జ‌రిగింది. కాగా నిన్నే అక్ష‌ర్ త‌న 28వ పుట్టిన‌రోజుని జ‌రుపుకున్నారు. త‌న గాళ్ ఫ్రెండ్ మేహాతో నిశ్చితార్థాన్ని జ‌రుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సహచరుడు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలతో ఇన్‌స్టాగ్రామ్‌ను మోతెక్కించారు. అక్షర్ పటేల్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి గుజరాత్ టీంమేట్ చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అక్షర్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. అలాగే, ప్రేమ చిహ్నంతో పాటు ‘మ్యారీ మీ’ అని బ్యాక్‌ గ్రౌండ్‌లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు. ఇప్పుడు వారి ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement