Monday, May 6, 2024

51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్రం

తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్‌‌కు అరుదైన గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ రజనీకాంత్‌ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. తమిళనాడు ఎన్నికలకు ముందు ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈనెల 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను రజనీ అందుకున్నారు. కాగా తాజాగా దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికవ్వడంతో ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే అత్యున్న‌త అవార్డు.1969 నుంచి కేంద్రం ఈ అవార్డును సినీరంగంలో విశేష‌కృషి చేసిన‌వారికి అందిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టిదాకా 50 మందికి ఈ అవార్డును అందించింది. అత్య‌ధికంగా బాలీవుడ్‌కు చెంది 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకోగా.. మిగిలిన‌వి ఇత‌ర భాష‌లకు చెందిన సినీ ప్ర‌ముఖులు అందుకున్నారు. గత ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అమితాబ్ అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement