Thursday, May 2, 2024

ఆరోగ్యశాఖ మంత్రి వింత ఎన్నికల ప్రచారం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్నిరోజుల్లోనే జరగనున్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొందరు అభ్యర్థులు చంద్రమండలానికి తీసుకువెళ్తామని ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. మరికొందరు అది ఫ్రీ.. ఇది ఫ్రీ అంటూ ప్రజలను నమ్మబలుకుతున్నారు. అయితే తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్య సమస్యలను బయటపెట్టి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్‌ ఇప్పటికే రెండు సార్లు గెలవగా.. మూడోసారి గెలవడానికి ప్రచారం ప్రారంభించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో తనకు బీపీ, షుగర్ ఉన్నాయని.. దయచేసి తనను ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నారు. ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మంత్రి విజయ్ భాస్కర్ స్పందిస్తూ వాస్తవిక జీవితంలో విశ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్‌ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఎంత మంత్రి సమర్ధించుకున్నా ఇన్ని ఆరోగ్య సమస్యలున్న ఆయన ఆరోగ్య మంత్రి ఎలా అయ్యాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement