Sunday, May 5, 2024

43మంది త‌మిళ‌నాడుకి చెందిన ‘జాల‌ర్ల‌’ను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ అధికారులు

స‌ముద్రంలో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన త‌మిళ‌నాడు జాల‌ర్ల‌ని శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేర‌కు నేవీ అధికారులు ప్ర‌క‌టించారు. జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీప ఆగ్నేయ సముద్రంలో ప్రాంతంలో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి వారిని అరెస్టు చేశాం. అలాగే 6 భారతీయ ఫిషింగ్ ట్రాలర్లను కూడా స్వాధీనం చేకున్నాం’’ అని శ్రీలంక నేవి వెల్ల‌డించింది. పట్టుబడిన భారతీయ జాల‌ర్ల‌కు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం ఇత‌ర అధికారుల‌కు వారిని అప్ప‌గిస్తామ‌ని, ఆ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని నేవి ప్ర‌క‌టించింది. రెండు దేశాలకు చెందిన జాల‌ర్లు అనుకోకుండా ఒకరి జలాల్లోకి వ‌స్తున్నారు. ఈ కార‌ణంగా త‌రుచూ రెండు దేశాల‌కు చెందిన మ‌త్స్య‌కారులు అరెస్టుల‌కు గురవుతున్నారు. ఈ విష‌యంలో త‌మిళ‌నాడుకు చెందిన అధికారులు స్పందించారు. తమ రాష్ఠ్రానికి చెందిన జాల‌ర్లు అరెస్టయిన విష‌యం వాస్త‌వ‌మే అని ధృవీక‌రించారు.

త‌మ రాష్ట్రానికి చెందిన 500 మంది మత్స్యకారులు శ‌నివారం చేప‌ల వేట‌కు బ‌య‌లుదేరార‌ని చెప్పారు. శ్రీలంక జ‌లాల్లోకి వెళ్లిన 43 మందిని ఆ దేశ నేవీ అధికారులు అరెస్టు చేశార‌ని తెలిపారు. జ‌లార్ల అరెస్టు విష‌యంలో మ‌త్య్స‌కారుల సంఘం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శ్రీ‌లంక నేవీ అధికారులు అరెస్టు చేసిన జాల‌ర్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది. లేక‌పోతే రేప‌టి నుంచి ఆందోళ‌న‌లు చేస్తామ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని స్థానిక ఎంపీ కేన‌వ‌స్ క‌ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. త‌మిళ‌నాడు జాల‌ర్ల‌ను విడిపించేందుకు కృషి చేయాల‌ని కోరారు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement