Thursday, November 7, 2024

రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో-త‌మిళ స్టార్ హీరో అజిత్

త‌మిళ స్టార్ హీరో అజిత్ కి బైక్ రైడింగ్ లు అంటే ఇష్ట‌మ‌ని అంద‌రికీ తెలుసు. వాటితో పాటు రైఫిల్ షూట‌ర్ కూడా.కాగా త‌మిళ‌నాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటున్నాడ‌ట హీరో అజిత్.47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీలు ఈ నెల 25న మొదలు కాగా, పోటీ రెండో దశలో పాల్గొనేందుకు అజిత్ తిరుచ్చి చేరుకున్నారు. అజిత్ కు రైఫిల్ షూటింగ్ లో మంచి నైపుణ్యాలు ఉన్నాయి. 2021 తమిళనాడు స్టేట్ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆయన ఆరు మెడల్స్ సాధించడం గమనార్హం. దీంతో ఈ విడత కూడా పోటీల్లో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. 10 మీటర్లు, 25 మీటర్లు, 50 మీటర్ల విభాగంలో ఆయన ప్రాథమిక దశల్లో పాల్గొన్నారు.
తిరుచ్చి రైఫిల్ క్లబ్ కు చేరుకున్న ఆయనకు అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది. దీంతో ఆయన థంబ్స్ అప్ సంకేతం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement