Monday, April 29, 2024

త‌మిళ‌నాడు రాష్ట్ర గీతంగా ‘త‌మిళ్ థాయ్ వాళ్తూ’ : వారు త‌ప్ప , అంద‌రూ లేచి నిల‌బ‌డాల్సిందే

ఇటీవల మద్రాసు హైకోర్టులో ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటపై పిటిషన్ దాఖలైంది. అది కేవలం ఓ పాట మాత్రమేనని, ఏ కార్యక్రమంలోనూ ఎవరూ లేచి నిలబడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది స్నాతకోత్సవం సందర్భంగా ఐఐటీ–మద్రాస్ లో ఆ పాటనూ ప్లే చేయలేదు. దీంతో వివాదం అలముకుంది. దీనిపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానిని తాజాగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించి.. అందరూ లేచి నిలబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో త‌మిళ‌నాడు రాష్ట్ర గీతాన్ని ప్లే చేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా త‌మిళ‌నాడు రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటే రాష్ట్ర గీతమని ప్రకటించింది.రాష్ట్ర గీతం వచ్చేటప్పుడు దివ్యాంగులు తప్ప మిగతా వారంతా లేచి నిలబడాల్సిందేనని ఆదేశాల్లో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement