Thursday, May 2, 2024

‘ర‌జ‌నీకాంత్’ పౌండేష‌న్ ద్వారా ‘పేద’ విద్యార్థుల‌కు ఉచిత‌ శిక్ష‌ణ‌

త‌మిళ‌నాడు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎన్ ఎస్పీఎస్ సీ)నిర్వ‌హించే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు పోటీప‌డే యువ‌తీయువ‌కుల‌కు ర‌జ‌నీకాంత్ పౌండేష‌న్ మెరుగైన శిక్ష‌ణ ఇవ్వ‌నుంది. దీనికోసం సూప‌ర్ -100బ్యాచ్ పేరిట ప్ర‌త్యేక విధానాన్ని రూపొందించారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌జాసేవ‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇటీవల (డిసెంబరు 12) తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. త‌న ర‌జ‌నీకాంత్ ఫౌండేష‌న్ ద్వారా యువ‌త‌కు చేయూత‌నివ్వ‌నున్నారు. 100 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం అని రజనీకాంత్ ఫౌండేషన్ వెల్లడించింది. ప్రస్తుతం సూపర్-100 బ్యాచ్ కు రిజిస్ట్రేషన్లు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement