Sunday, April 28, 2024

ప్ర‌ధాని మోడీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై సుప్రీంకోర్టులో విచార‌ణ – ప‌లు కీల‌క ఆదేశాలు జారీ

సాక్షాత్త్ దేశ ప్ర‌ధానికే ర‌క్ష‌ణ క‌రువ‌యితే మిగ‌తా వారి ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పంజాబ్ ప‌ర్య‌ట‌న , ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌ల‌యింది. కాగా ఈ పిటీష‌న్ ని సుప్రీంకోర్టు నేడు విచారించింది. ఈ మేర‌కు ప‌లు కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న పంజాబ్ , హ‌ర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్ట్ లో వాదనల సందర్భంగా…ఈ ఘటన అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోందని పంజాబ్ ఏజీ సీనియర్ న్యాయవాది డీఎస్ పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement