Thursday, May 2, 2024

Breaking: అత్యంత క్లిష్టంగా కృష్ణ ఆరోగ్యం .. కాంటినెంటల్ డాక్టర్లు..

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ… మధ్య రాత్రి కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆయన రాగానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లి చికిత్స అందించామన్నారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. క్రిటికల్ స్టేజ్ లో డాక్టర్లందరం కలిసి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై కృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గంట కీలకమేనని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement