Monday, October 2, 2023

రసమయికి మద్దతుగా బైక్ ర్యాలీ..

కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఖబర్దార్ అంటున్న గులాబీ శ్రేణులు
మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ వాహనంపై దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యేకు మద్దతుగా గులాబీ శ్రేణులు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. సోమవారం కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు తెరాస శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రసమయికి మద్దతుగా నినాదాలు చేయడంతో పాటు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెరాస నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రసమయి వాహనంపై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. పిచ్చి వేషాలు మానుకోకపోతే తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement