Thursday, April 25, 2024

సూప‌ర్ అనిపిస్తోన్న ‘సూప‌ర్ మ‌చ్చి’ ట్రైల‌ర్

హీరో క‌ల్యాణ్ దేవ్ సూప‌ర్ మ‌చ్చి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి పులి వాసు ద‌ర్శ‌కుడు. కాగా ఈ సినిమాని రిజ్వాన్ నిర్మించాడు. కాగా ఈ చిత్రంతో ర‌చిత రామ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ప‌రిచ‌యం కానుంది. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ బాగుంది… ట్రైలర్ చూస్తుంటే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అని తెలుస్తోంది. హీరోను హీరోయిన్ రాముడిగా మార్చేస్తుందా ? లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఈ కథలో హీరోయిన్ ప్రేమని పొందలేకపోయిన అజయ్ .. విలన్ గా మారతాడని అర్థమవుతోంది.రాజేంద్రప్రసాద్ .. తనికెళ్ల భరణి .. పోసాని .. ప్రగతి వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి ప్లస్ గా ఉన్నారు. “వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా” అనే రాజేంద్రప్రసాద్ డైలాగ్ బాగుంది. ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఈ నెల 14వ తేదీన ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ కానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement