Monday, April 29, 2024

డేవిడ్ వార్న‌ర్ కు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అభినంద‌న‌లు

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ కు స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ ట్విట్ట‌ర్ లో అభినంద‌న‌లు తెలిపింది. గత ఐపీఎల్ సీజన్ లో డేవిడ్ వార్న‌ర్ పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. అలాగే టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ‘యాషెస్ విజయం పట్ల శుభాభినందనలు డేవీ. చూస్తుంటే నువ్వు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుంది. మ్యాచ్ అనంతరం పార్టీని బాగా ఎంజాయ్ చేస్తావనుకుంటున్నాం. అలాగే, ఐపీఎల్ తాజా వేలంలో మంచి ధర పలకాలని కోరుకుంటున్నాం’ అంటూ సన్ రైజర్స్ యాజమాన్యం పేర్కొంది. ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఆసీస్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు టెస్టుల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించి స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇక ఈ విజయంలో వార్నర్‌ తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై మూడో టెస్టులో నెగ్గి యాషెస్ ను నిలబెట్టుకున్న‌ నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement