Sunday, May 5, 2024

సన్నిలియోన్‌ వర్క్‌ పర్మిట్‌ రద్దు!

నటి సన్నీ లియోన్‌ హిందీ చిత్రాలతో పాటుగా తెలుగు సినిమాల్లో సైతం నటిస్తొంది. కరెంటుతీగ, కల్కి చిత్రాల్లో నటించిన స‌న్నీ తాజాగా మంచు విష్ణు సినిమాలో న‌టించేందుకు కమిటైంది. అలాగే అనామిక అనే వెబ్‌సిరీస్‌ కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే ఆమె వర్క్‌ పర్మిట్‌ను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం రద్దుచేసినట్టు తెలిసింది. ఇండో, బంగ్లా కలిసి సోల్జర్స్‌ అనే సినిమా నిర్మిస్తున్నారు. షమ్మీమ్‌ అహ్మద్రోని దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సన్నీ నటించ‌నుంది. ఈ విషయం ఆమె స్వయంగా తెలిపింది. ఇందుకోసం బంగ్లా ప్రభుత్వం ఆమెతో పాటు పదిమంది ఆర్టిస్టులకు వర్క్‌ పర్మిట్‌ జారీ చేసింది.

అయితే తాజా సమాచారం ఏమంటే ఈ చిత్రంలో సన్నీ నటించడం లేదట. సన్నీ బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నిరసన తెలుపుతామని కొన్ని ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలు హెచ్చరించాయి. దీంతో పరిస్థితిని సమీక్షించిన అక్కడి ప్రభుత్వం ఇది శాంతి, భద్రతల సమస్యగా మారకుండా ఉండాలని సన్నీ వర్క్‌ పర్మిట్‌ను మాత్రం క్యాన్సిల్ చేస్తున్న‌ట్టు తెలిపింది. మిగతా ఆర్టిస్టుల పర్మిట్‌లకు ఇబ్బంది లేదు. సన్నీ లేకుండా షూటింగ్‌ చేస్తారా? లేక మరో నటిని ఎంపికచేస్తారా అనేది తేలాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement