Monday, April 29, 2024

విద్యార్థినిల‌తో క‌లిసి టీచ‌ర్ డ్యాన్స్ – వైర‌ల్ గా వీడియో

ఓ టీచ‌ర్ విద్యార్థినిల‌తో క‌లిసి ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ లోని సాంగ్ కి త‌ర‌గ‌తి గ‌దిలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. విద్యార్థులు కొద్దిగా తడబడినా.. టీచర్ మాత్రం స్టెప్పుల్లో లయ తప్పలేదు. దీన్ని ఇప్పటికే 5.69 లక్షల మంది చూసేశారు. ఒకరి తర్వాత ఒకరు క్రమబద్ధంగా, లయబద్దంగా స్టెప్పులు వేశారు. టీచర్ కూడా వారిలో ఒకరిగా మారిపోయారు. ఈ డ్యాన్స్ ని వీడియో తీయించారు. టీచర్ మను గులాటి స్వయంగా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. వేసవి శిబిరం చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంద‌ని టీచర్ తన పేజీలో రాశారు. ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటీ స్నేహంగా మెలగడం ద్వారా విద్యార్థుల మనసులను చూరగొనడమే కాదు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న వ్యక్తి. ఇందులో 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి అందుకున్న నేషనల్ టీచర్స్ అవార్డు కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement