Wednesday, May 8, 2024

మ‌రోసారి సుడిగాలి సుధీర్ కి పెళ్ళి – పెళ్ళికూతురు ర‌ష్మీ కాదట‌

జ‌బ‌ర్థ‌స్త్ షోతో సుడిగాలి సుధీర్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో, ర‌ష్మీతో రిలేష‌న్ తో కూడా అంతే ఫేమ‌స్ అయ్యాడు. ఏకంగా వీరిద్ద‌రికీ ఈ షో లో పెళ్ళికూడా చేశారు. అయితే మ‌రోసారి పెళ్ళిపీట‌లెక్కాడు సుధీర్. ఈసారి ర‌ష్మీతో కాదండోయ్. ఎవ‌రో కొత్త అమ్మాయి. రష్మి లేని టైమ్‌లో, ఆమెకి తెలియకుండా సుడిగాలిసుధీర్‌ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అంతేకాదు ఇంద్రజ, హైపర్‌ ఆది వంటి వారు హాజరు కాగా సుధీర్‌ మ్యారేజ్‌ అత్యంత వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నెటిజన్లకి, రష్మి అభిమానులకు షాకిస్తుంది. అభిమానులే ఇంతగా ఫీల్‌ అవుతుంటే, ఇక రష్మి ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుధీర్‌ జ‌బ‌ర్ద‌స్త్ తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు. ఈ షోకి ఆయనే యాంకర్‌. ఇతర కామెడీ షోలకు దీటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ రన్‌ అవుతుంది. ఆదరణ పొందుతుంది. తాజాగా ఈ షోలోనే సుడిగాలి సుధీర్‌, మరో కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విశేషం. అయితే ఇది స్కిట్‌లో భాగంగానే చేశారనే టాక్‌ వినిపిస్తుంది. జనరల్‌గా ఈ షోలో చాలా సార్లు పెళ్లిళ్లు చేశారు. హైపర్‌ ఆది, వర్ష, ఇమ్యాన్యుయెల్‌ మ్యారేజ్‌లు చేశారు. అలానే ఇది కూడా అని అంటున్నారు. కానీ తెరపైకి ఇప్పుడు కొత్త అమ్మాయి కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, ఈ రూపంలో సుధీర్‌ తాను చేసుకోబోయే అమ్మాయిని తెరకి పరిచయం చేస్తున్నారా? లేక ఇది జస్ట్ డ్రామా మాత్రమేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోలో రష్మి ఉండదు. ఆమె లేని షోలో,ఆమెకి తెలియకుండా సుధీర్‌ మ్యారేజ్‌ జరగడం, పైగా ఎవరికీ తెలియని ఓ కొత్త అమ్మాయితో జరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement