Tuesday, May 7, 2024

భారతీయులను త‌ర‌లించేందుకు విమానాల‌ను పెంచాలి : ప్ర‌ధాని మోడీ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని భార‌త్ కు త‌ర‌లించేందుకు విమానాల సంఖ్య‌ను పెంచాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధికారుల‌ను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై ఆయన అధికారులతో చర్చించారు. ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న సంగతి తలసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను తరలిస్తున్నారు. తాజాగా కీవ్ లో గాయపడిన భారతీయ విద్యార్థి ఘటనపై కూడా చర్చించినట్లు సమాచారం. అత్యంత వేగంగా భారతీయులను తరలించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి 9 వేల మందిని తరలించారు. మరో ఐదు వేల మంది వరకూ భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దీంతో వారందరీని త్వరితగతంగా భారత్ కు తరలించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement