Saturday, May 4, 2024

Story : ప్ర‌ధాని మోడీ పుట్టిన‌రోజు-ఆయ‌న‌కి ఎటువంటి భ‌ద్ర‌త ఉందో తెలుసా..

నేడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పుట్టిన‌రోజు..ఆయ‌న‌కి బ‌ర్త్ డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్ర‌ధానికి ఎటువంటి భ‌ద్ర‌త‌ని అందిస్తున్నారో తెలుసుకుందాం..భార‌త రాజ్యాంగం ప్ర‌కాంరం.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత ముఖ్య‌మైన వ్య‌క్తి ప్ర‌ధాని అనే సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ర‌క్ష‌ణ దేశానికి అంత్యంత ముఖ్య‌మైన‌ది. అందుకే ఆయ‌న భ‌ద్రంగా ఉంచ‌డానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఏర్ప‌డింది. ఇది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రధానికి 24 గంటల నిఘా, భద్రతను అందిస్తుంది. SPG అనేది అత్యంత గోప్యంగా ఉండే ఎలైట్ ఏజెన్సీ. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏకైక ల‌క్ష్యం ప్రధానమంత్రి భద్రత. ప్రస్తుతం 3,000 కంటే ఎక్కువ మంది యాక్టివ్ సిబ్బంది ఈ ఎస్పీజీలో ప‌ని చేస్తున్నారు. అక్టోబర్ 1984లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హ‌త్య చేసిన నేప‌థ్యంలో 1985లో దీనిని రూపొందించారు. ఎస్పీజీ చట్టం భారత ప్రధానికి సమీప భద్రతను అందించాలని పిలుపునిచ్చింది. బ్రిటీష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి మొదటి 34 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రులకు ఢిల్లీ పోలీసులు రక్షణ కల్పించారు.

దీనిని డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన అధికారి పర్యవేక్షించేవారు. అయితే 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం VVIPలు, VIPల అత్యున్నత స్థాయి భద్రతా నిర్మాణాన్ని మెరుగుపర్చాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావించిది. అంతకు ముందే 1981లో ఆవిర్భవించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను శాశ్వత విభాగంగా మార్చింది. ఈ విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 30 మార్చి 1985న పుట్టుకొచ్చింది..స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్- 1988 ప్రకారం.. భారత మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు, ప్రధానికి జాతీయంగా అంతర్జాతీయంగా అన్ని సమయాల్లో రక్షణ కల్పించడం ఈ గ్రూప్ బాధ్యత . కానీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (సవరణ) చట్టం- 2019 ద్వారా ఈ సంస్థ కేవలం ప్రధానమంత్రికి మాత్రమే రక్షణ కల్పిస్తుంది. ఎస్పీజీ జీరో ఎర్రర్, కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే నినాదంతో పనిచేస్తుంది. SPG సిబ్బంది ఎప్పుడూ భార‌త్ లో, విదేశీ భూభాగాలలో భక్తి, అంకితభావం, కృషి, ధైర్యంతో తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాలి. శౌర్యం, సమర్పణం, సురక్షణం స్ఫూర్తిని నిల‌బెట్టుకోవ‌డానికి త‌మ‌ను తాము పూర్తిగా అంకితం చేసుకుంటారు. SPG చట్టం ప్ర‌కారం.. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు అవసరమైనప్పుడు ప్రత్యేక రక్షణ బృందానికి సహాయం చేయాల్సి ఉంటుంది. పీఎం ప్ర‌యాణించే మార్గాన్ని సురక్షితం చేస్తుంది. ప్రధానమంత్రిని సంప్రదించే వారిపై విధ్వంస నిరోధక తనిఖీలు, పరీక్షలను త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement