Sunday, April 28, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ న‌ష్టాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు..నేడు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 773పాయింట్లు న‌ష్ట‌పోయి 58,152కి దిగజారింది. నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 17,374 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.94%), టాటా స్టీల్ (0.52%), ఎన్టీపీసీ (0.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.09%), ఐటీసీ (0.09%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. టెక్ మహీంద్రా (-2.94%), ఇన్ఫోసిస్ (-2.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.31%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.16%) టాప్ లూజర్స్ గా మిగిలింది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మన మార్కెట్లు కూడా ఈరోజు కుప్పకూలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement