Sunday, April 28, 2024

AP: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరల సవరణ.. పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

రాష్ట్రంలో కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలను సవరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముల విలువను ఈ నెల 6 తేదీ నుంచి సవరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సవరించాల్సిందిగా.. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేపటి నుంచి కొత్త మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ విలువలకు అనుగుణంగా ఆ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.

కాగా, ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్థీకరించిన 26 జిల్లాల నుంచి పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement