Saturday, May 4, 2024

తమిళనాడు సీఎంగా స్టాలిన్… నేడే ప్రమాణస్వీకారం

తమిళనాడులో నూతన ప్రభుత్వం శుక్రవారం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 మందితో స్టాలిన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. దురాయిమురుగన్​ వంటి సీనియర్ నేతలు సహా 15 మంది కొత్తవారికి ఆయన మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ జాబితాకు గవర్నర్‌ బన్వరీలాల్​ కూడా ఆమోదం తెలిపారు. ఈ 34 మంది కూడా మంత్రులుగా స్టాలిన్​తో పాటుగా రాజ్​భవన్​లో ప్రమాణస్వీకారం చేస్తారు.

డీఎంకే ఎమ్మెల్యే సుబ్రమణియన్‌కు ఆరోగ్యశాఖ కేటాయించగా.. దురైమురుగన్‌కు నీటిపారుదల శాఖ కేటాయించారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. హోంశాఖతో పాటు సంక్షేమశాఖ, జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ తదితర పోర్టుఫోలియోలను స్టాలిన్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్​ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకూ చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement