Saturday, May 18, 2024

 ‘శ్రీదేవి శోభన్​బాబు’ ట్రైలర్ విడుదల

సంతోష్‌ శోభన్‌, వర్ష జంటగా నటించిన మూవీ’శ్రీదేవి శోభన్​బాబు’. ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ సినీరంగంలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్ప‌ర‌చుకున్నాడు. ఇటీవ‌లే ఈయ‌న మంచి రోజులోచ్చాయి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించాడు. తాజాగా ‘శ్రీదేవి శోభన్​బాబు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా కొనిదెల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్​ను ‘ఆచార్య’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి విడుదల చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement