Thursday, May 2, 2024

ల‌క్కీ ప‌ర్స‌న్ – లాట‌రీ టిక్కెట్ కొన్నాడు – కోటీశ్వ‌రుడ‌య్యాడు

అదృష్టం వ‌రించాలే గాని రాత్రికి రాత్రే ప‌లువురి త‌ల‌రాత‌లు మారిపోయిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడ‌లాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని సౌత్ కరోలినాకు చెందిన ఓ వ్య‌క్తి ప‌నిముగించుకొని ఇంటికెళ్తూ అనుకోకుండా లారెన్స్ న‌గ‌రంలోని ప్లేయ‌ర్ స్టోర్ నెంబ‌ర్ 105 అనే లాట‌రీ టికెట్స్ అమ్మే దుకాణం వ‌ద్ద ఆగాడు. ఎలాగో ఆగాం క‌దా అని గోల్డ్ 50 ఎక్స్ లాట‌రీ స్క్రాచ్ టికెట్‌ను ఐదు డాల‌ర్ల‌కు కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తాపీగా సోఫాలో ప‌డుకొని స్క్రాచ్ చేశాడు. అందులో అమౌంట్ చూసి అత‌డికి నోట మాట‌రాలేదు. రూ. 1.5కోట్లు గెలుచుకోవ‌డంతో ఉబ్బిత‌బ్బిబైపోయాడు. అనంత‌రం లాట‌రీ టికెట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు దుకాణానికి పరుగెత్తాడు. కాగా, ఆ డ‌బ్బుల‌తో ఏంచేస్తాడో అత‌డు ఇంకా వెల్లడించ‌లేదు. మొత్తానికి అదృష్టం అంటే ఇత‌నిదే క‌దా.

Advertisement

తాజా వార్తలు

Advertisement