Thursday, May 2, 2024

న‌టి సోఫీ ట‌ర్న‌ర్ రెండ‌వ‌సారి త‌ల్లి కానుందా .. వైర‌ల్ గా బేబి బంప్ ఫొటోలు

గేమ్ ఆఫ్ థ్రోన్స్ న‌టి సోఫీ ట‌ర్న‌ర్ రెండ‌వ‌సారి త‌ల్లి కానుంది. ఈమె గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రాకి తోడికోడ‌లు. అయితే తాను గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని ఆమె ప్ర‌క‌టించ‌లేదు. సోఫీ , ఆమె భర్త గాయకుడు జో జోనాస్ రెండవ గర్భం గురించి ప్రకటించలేదు , ఏ విధ‌మైన ఫోటోలు పోస్ట్ చేయలేదు. కాగా సోఫీ జోతో కలిసి బీచ్ వ‌ద్ద సేద‌తీరేందుకు వెళ్లారు. సోఫీ టర్నర్, జో జోనాస్ హాలిడేని చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సోఫీ ట్రెండీ చెకర్డ్ టూ-పీస్ ఫ్రాంకీస్ బికినీ స్విమ్‌సూట్ , సన్ గ్లాసెస్ ధరించి కనిపించింది. సోఫీ బికినీలో తన బేబీ బంప్ క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ ఫోటోలన్నింటిలో సోఫీ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఈ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement