Monday, May 6, 2024

Breaking: మెల్ల మెల్లగా సన్​రైజ్​.. దూకుడు పెంచిన హైదరాబాద్ ​

టాటా ఐపీఎల్-2022 టోర్నీలో శుక్రవారం హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబై సీసీఐ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​ మొదటి నుంచి రసవత్తరంగా మారింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ను స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు క‌ట్టడి చేశారు. చివ‌రిలో ఆండ్రూ ర‌స్సెల్ నిల‌క‌డ‌గా ఆడ‌టంతో 8 వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా టీమ్​.. హైద‌రాబాద్ ముందు 176 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచింది.

కాగా, సెకండ్​ ఇన్సింగ్స్​లో బరిలోకి దిగిన సన్​ రైజర్స్​ కోల్​కతా బౌలర్లను చిత్తు చిత్తుగా దంచికొడుతున్నారు. అయితే 1.4ఓవర్​లోనే అభిషేక్​ శర్మ మూడు పరుగులు మాత్రమే చేసి మొదటి వికెట్​గా పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత 5.2 ఓవర్లలో 39 ఓవర్ల టీమ్​ స్కోర్​ వద్ద కెప్టెన్​ కేన్​ విలియమ్స్​ (17) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక అప్పటి నుంచి థర్డ్​ వికెట్​ పార్టనర్​షిప్​లో రాహుల్​ త్రిపాఠి, మార్క్రం స్ట్రైక్​ రొటేట్​ చేస్తూ కలిసిమెలిసి ఆడుతున్నారు.  అయితే.. 14.2 ఓవర్​లో 133 పరుగులు వద్ద 71 పరుగులు చేసిన రాహుల్​ త్రిపాఠి అవుటయ్యాడు. నికోలస్​ పూరన్​, మార్క్రం కలిసి ఆట కొనసాగిస్తున్నారు.

16 ఓవర్లు ముగిసే సరికి సన్​రైజర్స్​ టోటల్​ స్కోరు 153/3 గా ఉంది. 24 బంతుల్లో 23 పరుగులు చేస్తే సన్​రైజర్స్​ జట్టు గెలుపు సాధించినట్టే..

కాగా, కోల్‌క‌తాలో బ్యాట్స్ మ‌న్లు నితీశ్ రాణా 54, ఆండ్రూ ర‌స్సెల్ 49, శ్రేయ‌స్స్ అయ్యర్ 28 ప‌రుగులు చేశారు. మిగ‌తా బ్యాట్స్ మ‌న్లు వెంట వెంట‌నే పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. స్వల్ప వ్యవ‌ధిలోనే వికెట్లు తీస్తూ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై ఒత్తిడి తేవ‌డంలో స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు విజ‌య‌వంతం అయ్యారు. కేవ‌లం ఐదు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముగ్గురు బ్యాట్స్ మ‌న్ల ను స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు సాగ‌నంపారు.

స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల లో న‌ట‌రాజ‌న్ మూడు, ఉమ్రాన్ మాలిక్ రెండు, భువ‌నేశ్వ ర్ కుమార్‌, మార్కో జాన్‌సెన్, సుచిత్ త‌లో వికెట్ తీసుకున్నారు. 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కోల్‌క‌తా 70 ప‌రుగులే చేసింది. నితీశ్ రాణాతో క‌లిసి జ‌ట్టు స్కోర్ పెంచేందుకు ప్ర య‌త్నిస్తున్న శ్రేయ‌స్ అయ్య ర్‌ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement