Tuesday, April 30, 2024

Flash: టీఆర్ ఎస్ లీడ‌ర్‌ను లేపేసేందుకు స్కెచ్‌.. రెక్కి నిర్వ‌హిస్తున్న దుండుగ‌ల అరెస్టు..

ప్ర‌భ న్యూస్ బ్యూరో, ఉమ్మ‌డి మెద‌క్‌: తెలంగాణ‌లో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ టీఆర్ ఎస్ మాజీ సర్పంచ్, మున్సిపాలిటీ చైర్‌ప‌ర్స‌న్‌ భర్త నజీబ్ ను చంపేందుకు స్కేచ్ వేశారు. ఆయ‌న‌పై దాడి చేయ‌డానికి రెక్కీ నిర్వ‌హించిన ఘ‌ట‌న ఈ రోజు రాత్రి వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించి నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయ‌ణ‌ఖేడ్ రాజీవ్ చౌరస్తా లో నిందితుల‌తో పాటు ఒక ఇన్నోవా వాహనం.. మార‌ణాయుధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన మిగతా 16 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితి నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement