Thursday, May 2, 2024

ఎస్ఐ రాసలీలలు.. ఆమె భర్తలేని సమయంలో ఇంటికొచ్చి..

వనపర్తి జిల్లాలో ఓ ఎస్ఐ త‌న అస‌లు రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఆ మ‌హిళ భ‌ర్త వేసిన సూప‌ర్ స్కెచ్‌తో ఎస్ఐ కీచ‌క బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఇల్లీగ‌ల్ కాంటాక్ట్ పెట్టుకోగా.. ఆ ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చిత‌క‌బాదిన ఘ‌ట‌న జ‌రిగింది.

వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన మ‌హిళ‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వాళ్లిద్ద‌రినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు. దీంతో ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ఆమె ముందు వాలిపోయాడు.

ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా ఆమె భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎస్ఐని విచక్షణా రహితంగా చిత‌క్కొట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement