Tuesday, May 14, 2024

షార్ట్ హెయిర్ తో సరికొత్తగా – నిహారిక

న‌టి, నిర్మాత నిహారిక కొత్త లుక్ లో మెరిసింది. షార్ట్ హెయిర్ తో స‌రికొత్త‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంటోంది. తాజా లుక్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది. ఇటీవల హైదరాబాద్ లోని ఓ పబ్ వ్యవహారంలో నిహారిక పేరు బయటకు రావడం కలకలం రేపింది. ఇటీవలే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా డిలీట్ చేసింది. ఈ వ్య‌వ‌హారం జ‌రిగిన ఇన్ని రోజుల‌కి తొలిసారిగా బ‌య‌టికి వ‌చ్చింది నిహారిక‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement