Monday, April 29, 2024

Big Breaking: 16,027 పోస్టుల భర్తీకి తెలంగాణలో సర్కార్ నోటిషికేషన్

తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 16,027 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5010, సివిల్ కానిస్టేబుళ్లు 4965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4423 పోస్టులు, 414 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టుల భర్తీ కి మే 2 నుంచి 20వతేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతిచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఐపీఆర్బీ.ఇన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement