Tuesday, April 30, 2024

ప్ర‌ముఖ ర్యాప‌ర్ పై కాల్పులు.. క‌న్నుమూసిన అకా

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ప్ర‌ముఖ ర్యాప‌ర్ అకా పై కాల్పులు జ‌రిపారు.ఈ ఘ‌ట‌న‌లో కిర్నార్ క‌న్నుమూశారు.ఆయ‌న వ‌య‌సు 35సంవ‌త్స‌రాలు. దక్షిణాఫ్రికా డర్బన్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌ ఆవరణలో శనివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆయనపై ఏకంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కిర్నాన్‌ ఫోర్బ్స్‌ సౌతాఫ్రికాలో ర్యాపర్‌ అకాగా బాగా ప్రసిద్ధి చెందారు.అకా ఈ నెల 27న ‘మాస్‌ కౌంటీ’ పేరుతో తన కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం. అకా హత్య విషయాన్ని అతని కుటుంబసభ్యులు కూడా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తమ బిడ్డ మరణం చాలా బాధాకరమని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అకా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియని, డర్బన్‌ పోలీసులు ఇచ్చే సమాచారం కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement