Tuesday, May 7, 2024

టాలీవుడ్​కి షాక్​.. కారుతో సహా నదిలో పడిపోయిన సమంత

టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంత ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, నటి సమంత కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ యాక్షన్ సీన్​ కోసం కారు డ్రైవ్ చేస్తుండగా.. అత్యంత ప్రమాదకరమై సీన్ షూట్ జరిగింది. నదికి రెండువైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి.

దురదృష్టవశాత్తూ ఆ వాహనం పట్టు తప్పి కారు నదిలో పడిపోయింది. దీంతో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ స్పైనల్ కార్డ్​కి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరినీ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ నిరవణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదైలంది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement