Monday, April 29, 2024

ష‌ణ్ముఖ్ , దీప్తిల బ్రేక‌ప్ కి ముందు ఏం జ‌రిగింది

వారిద్ద‌రూ సోష‌ల్ మీడియాలో స్టార్స్. ఈ జంట‌కి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జ‌నాల్లో సూప్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ష‌ణ్ముఖ్, దీప్తి సున‌యిన‌. గ‌త ఐదు ఏళ్లుగా వీరి రిలేష‌న్ షిప్ కొన‌సాగుతూ వ‌చ్చింది. బిగ్ బాస్5 పుణ్య‌మా అని వీరు విడిపోయారు. హౌస్ లో ష‌ణ్ముఖ్ , సిరితో క్లోజ్ గా ఉండ‌టం వీరి బ్రేక‌ప్ కి కార‌ణ‌మ‌నే వాద‌న వినిపిస్తుంది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన వెబ్ సీరిస్, క‌వ‌ర్ సాంగ్స్ కి భారీగా వ్యూస్ వ‌చ్చేవి. బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముఖ్ చేసిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. తోటి కంటెస్టెంట్ సిరితో రొమాన్స్ చూడలేక బయట ఉన్న ఆయన ఫ్యాన్స్ రీవర్స్ అయ్యారు. ఇక హౌస్ లోపల షన్నూ బిహేవియర్ ని చూసిన బయట ఉన్న దీపు..ఇలాంటి వాడు నాకు వద్దు బాబోయ్ అంటూ బ్రేకప్ చెప్పేసింది.

ఇలా దీప్తి బ్రేకప్ చెప్పే ముందు రోజు రాత్రి షన్ను-దీప్తి మధ్య మాటల యుద్ధమే నడిచిందట. దీప్తీ ని కూల్ చేసేందుకు షన్నూ ప‌లు ర‌కాలుగా ట్రై చేసాడట. కానీ ఆమె మొండిగానే మనం విడిపోదాం అని గట్టిగా చెప్పారట. ఇక షన్ను ఫైనల్ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు అప్పుడు నేను నిన్ను వదిలేస్తా అని అనడంతో.. దీప్తీ ఏంటి అని అడగ్గా..నువ్వు నేను సిరి తప్పు చేసాం అంటే నమ్ముతున్నావా అని అడిగారట. దీనికి దీప్తి ఏడుస్తూ యస్..మీది ఫ్రెండ్ షిప్ హగ్ కాదు..నువ్వు మారిపోయావ్ షన్ను అంటూ ఏడుస్తూ గుడ్ బై చెప్పి ఫోన్ కట్ చేసిందట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement