Sunday, May 5, 2024

Breaking: నడ్డా పర్యటనపై హైటెన్షన్.. పోలీసుల అదుపులో బీజేపీ అధ్యక్షుడు?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయంలోనే నడ్డాను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సిద్దమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసన ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నడ్డా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అయితే, నడ్డా క్యాండిల్ ర్యాలీకి పోలీసు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్ వచ్చిన ఆయనను ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అదుపులోకి తీసుకోనే అవకాశముంది.. అన్నోజిగూడ RSS క్యాంపు కు తరలించే అవకాశం ఉంది. అయితే, ర్యాలీని నిర్వహించి తీరుతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. కరోనా ఆంక్షల జీవోను జేపీ నడ్డాకు పోలీసులు ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement