Wednesday, May 8, 2024

బ‌ల‌మైన ఈదురుగాలులు.. 400ఇళ్లు ధ్వంసం.. ఒక‌రు మృతి

భీక‌ర తుఫాన్ వ‌ల్ల ఒక‌రు మ‌ర‌ణించారు. బ‌ల‌మైన ఈదురుగాలులు వీయ‌డంతో 400ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కాగా ఈ సంఘ‌ట‌న అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించారు. తుపాను కారణంగా నివాసాలపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తుఫాను వల్ల 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పథర్కండి రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్ అర్పితా దత్తా మజుందార్ తెలిపారు. ఓ ఇళ్లు కూలిపోవడంతో అందులో ఉన్న ఏడేళ్ల బాలుడు మరణించారని చెప్పారు. పథర్కండిలో కేవలం ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన 428 కుటుంబాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న మూడు రోజుల్లో ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement