Monday, May 6, 2024

Accident: బైక్ ను ఢీకొట్టిన సీరియల్ నటి

తెలుగు సీరియల్ నటి లహరి తన కారుతో ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. రాత్రి షూటింగ్ ముగించుకొని తన కారులో ఇంటికి బయల్దేరిన లహరి… దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ను నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి లహరి భయపడిపోయింది. జనాలను చూసి భయంతో ఆమె కారు కూడా దిగలేదు.  సమాచారం అందుకున్న పోలీసులు  ఆమెను కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లహరికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఆమె మద్యం సేవించలేదని తేలింది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బుల్లితెరపై నటి లహరి ఎన్నో సీరియల్స్ లో నటించింది. అంతేకాదు పలు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులందరికీ చేరువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement